
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ 2024-–25 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, వాటర్ రీ సోర్సెస్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్.
అర్హతలు : పీహెచ్‌డీ ప్రోగ్రామ్ అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత. యూజీసీ- నెట్/ యూజీసీ- సీఎస్‌ఐఆర్ నెట్/ స్లెట్/ గేట్/ జీప్యాట్ వ్యాలిడ్ స్కోరు ఉండాలి.
సెలెక్షన్ : పీహెచ్‌డీ ప్రోగ్రామ్ అనుసరించి విద్యార్హతలు, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, రీసెర్చ్ పబ్లికేషన్స్, రీసెర్చ్ వర్క్ పీపీటీ ప్రెజెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి, హైదరాబాద్ అడ్రస్‌కు ఫిబ్రవరి 24 వరకు పంపించాలి. పూర్తి వివరాల కోసం www.jntuh.ac.in