బెస్ట్ అవైలబుల్ స్కూల్​లో ప్రవేశాలకు దరఖాస్తులు

నస్పూర్, వెలుగు :  బెస్ట్ అవైలబుల్ స్కూల్​లో గిరిజన విద్యార్థులకు 3,5,8 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్​ అధికారి ఖష్బూ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి గానూ జిల్లాకు 41సీట్లు కేటాయించగా 3వ తరగతిలో 21, 5లో 10, 8వ తరగతిలో 10 సీట్లు ఉన్నాయని తెలిపారు.

జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఆఫీస్​లో దరఖాస్తులను ఉచితంగా ఇస్తారని తెలిపారు. ఈ నెల21నుంచి జూన్ 6లోగా సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి దరఖాస్తులు సమర్పించాలన్నారు. జూన్ 12న అభ్యర్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఆఫీస్​లో సంప్రదించాలన్నారు.