
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్ యూనివర్సిటీ) 2023–24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత : సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, ఎంఎస్సీ , ఎంపీటీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్ : ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. యూజీసీ–నెట్ లేదా యూజీసీ–సీఎస్‌ఐఆర్ నెట్/జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత పొందిన అభ్యర్థులకు ప్రవేశపరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులు : ఆఫ్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 15 వరకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ ది రిజిస్ట్రార్, శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌సైన్సెస్, స్విమ్స్ యూనివర్శిటీ, అలిపిరి రోడ్, తిరుపతి అడ్రస్‌కు పంపించాలి.