
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అసిస్టెంట్ కోచ్, కోచ్, సీనియర్ కోచ్, హైపెర్ఫార్మెన్స్ కోచ్.. మొదలైన 214 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతుంది. కాంట్రాక్ట్, డిప్యుటేషన్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు.
పోస్టులు
అసిస్టెంట్ కోచ్: 117 ఖాళీలు ఉన్నాయి. సాయ్ లేదా గుర్తింపు పొందిన దేశ/ విదేశీ యూనివర్సిటీల నుంచి కోచింగ్ డిప్లొమా/ తత్సమాన అర్హత ఉండాలి. ఈ పోస్టులకు ఉద్యోగానుభవం అవసరం లేదు.
2. కోచ్/ సీనియర్ కోచ్: 88 ఖాళీలు ఉన్నాయి. కోచింగ్ డిప్లొమా/ తత్సమాన అర్హత ఉండాలి. లేదా ఒలింపిక్స్‌లో రెండుసార్లు పాల్గొని, ఉండాలి. కోచ్ పోస్టులకు 5 ఏళ్ల అనుభవం ఉండాలి. సీనియర్ కోచ్‌లకు 7 ఏళ్ల అనుభవం ఉండాలి.
3. హైపెర్ఫార్మెన్స్ కోచ్: 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోచింగ్‌లో డిప్లొమా/ తత్సమాన అర్హత ఉండాలి. 15 ఏళ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ కోచ్‌కు 40 ఏళ్లు, కోచ్‌కు 45 ఏళ్లు, సీనియర్ కోచ్‌కు 50 ఏళ్లు, హైపెర్ఫార్మెన్స్ కోచ్‌కు 60 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.sportsauthorityofindia.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.