నిమ్స్​లో ఫ్యాకల్టీ పోస్టులు

పంజాగుట్టలోని నిజాం ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ప్రాతిపదికన 65 ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌‌, డీఎన్‌‌బీ, డీఎం, ఎంసీహెచ్‌‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయసు 50 ఏళ్లు మించకూడదు. 

ALSO READ: ఐటీ కారిడార్​లో ధర్నాలకు పర్మిషన్ లేదు : మాదాపూర్ డీసీపీ సందీప్

ఎంపిక: అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.దరఖాస్తులు: ఆఫ్‌‌లైన్‌‌ దరఖాస్తులను ది ఎగ్జిక్యూటివ్‌‌ రిజిస్ట్రార్‌‌, నిమ్స్, రెండో అంతస్తు, ఓల్డ్‌‌ బ్లాక్‌‌, పంజాగుట్ట, హైదరాబాద్ అడ్రస్​కు సెప్టెంబర్ 30 లోపు పంపించాలి. వివరాలకు www.nims.edu.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.