- ఈ నెల 23 వరకు అప్లికేషన్లకు గడువు
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో ఐదేండ్లుగా పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, స్పోర్ట్స్, కల్చరల్విభాగాల అభివృద్ధి కోసం పని చేస్తున్న సంస్థలు, వ్యక్తులు, సొసైటీలు, ట్రస్టులు ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరిస్తామన్నారు. ఆన్లైన్ లో సమర్పించాలనుకునేవారు https://governor.telangana.gov.in వెబ్సైట్ లో నామినేషన్ ఫామ్, ఇతర డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని వివరించారు.
అలాగే, ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలనుకునేవారు పైన పేర్కొన్న వెబ్సైట్ నుంచే అందుబాటులో ఉంచిన నిర్దేశిత ఫార్మాట్ లను డౌన్లోడ్ చేసుకొని నామినేషన్ ఫారమ్ నింపి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ సెక్రటేరియట్, రాజ్ భవన్, సోమాజీగూడ, హైదరాబాద్ – 500041 అడ్రస్ కు స్పీడ్ ఫోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా కూడా సమర్పించవచ్చని స్పష్టం చేశారు.
ఈ నెల 23 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.