ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైన్స్ షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో దరఖాస్తులు ఇచ్చేందుకు అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో నిలబడ్డారు. రాత్రి 10గంటల వరకు కరీంనగర్ జిల్లాలో 94 షాపుల 3,604, జగిత్యాలలో 2,200, పెద్దపల్లిలో 77 షాపులకు 902, రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1715 అప్లికేషన్లు వచ్చాయి.
అర్ధరాత్రి వరకు క్యూలైన్లు ఉండడంతో అప్లికేషన్లు అవకాశముందని ఎక్సైజ్ఆఫీసర్లు చెబుతున్నారు. కరీంనగర్‌లో గతేడాది 1720 అప్లికేషన్లు రాగా ఈ సారి వచ్చిన ఆ సంఖ్య రెట్టింపయింది.
- కరీంనగర్ క్రైం, వెలుగు