
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ 2024-–2026 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్. రెండేళ్ల ఎంబీఏ ఫుల్ టైం ప్రోగ్రామ్‌లో 75 సీట్లు ఉన్నాయి.
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, క్యాట్-2023 ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్-2023 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్ రూ.600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. వివరాలకు www.acad.uohyd.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.