
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 217 ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ) జూన్ 2023లో ప్రారంభమయ్యే కోర్సులో ట్రైనింగ్ పొందుతారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
సెలెక్షన్: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు రూ.56100తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలుంటాయి. సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది. ఆన్లైన్లో నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.