
పాపన్నపేట, వెలుగు: ఈ ఎమ్మారై 108 సంస్థ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల నియామకం కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ మంగళవారం తెలిపారు. 11వ తేదీన 108 ఆఫీస్ సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి బీఎస్సీ, బీ జడ్సీ, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ , డి ఫార్మసీ, ఎం ఎల్ టి కోర్సులు పూర్తి చేసి ఉండాలని మిగతా వివరాలకు 8008 19 5522 నెంబర్ సంప్రదించాల్సిందిగా సూచించారు.