కమలాపూర్/వర్ధన్నపేట, వెలుగు : గృహలక్ష్మి స్కీమ్‌కు అప్లికేషన్లు వెల్లువలా వస్తున్నాయి. అప్లికేషన్‌కు మూడు రోజులే చాన్స్ ఇవ్వడంతో వేలాది మంది అప్లికేషన్లు అందజేస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం 821, బుధవారం 2,979 అప్లికేషన్లు వచ్చాయి.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని మున్సిపల్, తహసీల్దార్ ఆఫీస్‌లో మంగళ, బుధవారాల్లో కలిపి సుమారు 1400 అప్లికేషన్లు వచ్చాయని తెలుస్తోంది. అప్లికేషన్ గురువారం ఒక్కరోజే గడువు ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు. అప్లికేషన్ గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు.