TSBIE- MHRD- నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు

TSBIE-  MHRD-  నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు

TSBIE-MHRD-నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌ల కోసం, పునరుద్ధరణ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ స్కాలర్‌షిప్‌ MHRD (CSSS) యొక్క తాజా దరఖాస్తులు మరియు పునరుద్ధరణ దరఖాస్తులు రెండింటికీ చివరి తేదీ 2022, అక్టోబర్ 31 అన్నారు. 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుందన్నారు.

జాతీయ స్కాలర్‌షిప్ కోసం ఇంతకు ముందు ఎంపికైన విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి తమ స్కాలర్‌షిప్ దరఖాస్తులను పునరుద్ధరించుకోవచ్చని సూచించారు. అప్లికేషన్ వెరిఫికేషన్ కోసం ఇన్‌స్టిట్యూషన్‌లకు నవంబర్ 15వ తేదీ చివరి తేదీ అన్నారు వెబ్‌సైట్‌ (http://scholarships.  gov.in) ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. టాప్ 20వ పర్సంటైల్ తాత్కాలికంగా ఎంపిక చేయబడిన అభ్యర్థుల జాబితా 54,458గా ఉందని.. అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inలో అందుబాటులో ఉందని ప్రకటనలో వెల్లడించారు.