హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉస్మానియా మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తులను ఫిబ్రవరి 3నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమర్పించాలన్నారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్ https://omc.ac.in ను సందర్శించాలని సూచించారు.