
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత : ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 30 సంవత్సరాలు మించకూడదు.
సెలెక్షన్ : ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. జనవరి 16 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వివరాలకు www.ecil.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.