రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్‌సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం నిర్వహిస్తున్న ఫ్రీ కోచింగ్‌కు అప్లై చేసుకోవాలని ఎస్‌సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి లక్ష్మి ఓ ప్రకటనలో సూచించారు. 3 నెలల పాటు నిర్వహించనున్న ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులో రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలతోపాటు, గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం 100 మంది ఎస్‌సీ నిరుద్యోగులకు మూడు నెలల పాటు కోచింగ్, భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు.
100 మందికి గానూ ఇప్పటికే 45 మంది అడ్మిషన్ తీసుకున్నారని, మిగిలిన 55 సీట్ల అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు ఫొటోలు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఈ నెల 15న సాయంత్రం 4గంటల లోగా సిరిసిల్ల చంద్రంపేట దగ్గర ఎస్సీ స్టడీ సర్కిల్ లో సంప్రదించాలన్నారు. ఇతర సమాచారం కోసం 9515622390 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చన్నారు.