
- వచ్చే నెల28 తో ముగియనున్న మాధవి పురి బుచ్ పదవీ కాలం
న్యూఢిల్లీ: సెబీకి కొత్త చైర్‌పర్సన్‌ను వెతికే పనిలో కేంద్రం ఉంది. ప్రస్తుత చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్(60) మూడేళ్ల పదవీ కాలం వచ్చే నెల 28 తో ముగియనుంది. ఐదేళ్ల పదవీ కాలానికి (లేదా ఏజ్ 65 ఏళ్లు వచ్చేంత వరకు) గాను కొత్త సెబీ చైర్‌పర్సన్‌ను నియమించుకునేందుకు ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.
సెబీ చైర్‌పర్సన్ పోస్ట్‌కి అప్లయ్ చేసుకోవడానికి వచ్చే నెల17 చివరి తేది. ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ 25 ఏళ్లు దాటి ఉండాలి. ఏజ్ 50 ఏళ్లకు పైనున్న వారిని తీసుకునే ఛాన్స్ ఎక్కువ.
బుచ్‌కు వాటాలున్న కన్సల్టింగ్ కంపెనీ వివిధ లిస్టెడ్ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుందని, అదానీ గ్రూప్‌కు ఫేవర్‌గా సెబీ పనిచేసిందని గతంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన విషయం తెలిసిందే.