ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు షురూ

ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు షురూ
  • వచ్చే నెల15 వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల్లో 2025– 26 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు శుక్రవారం నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయని సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు. వచ్చే నెల 15 వరకు  www.tgswreis.cgg.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో అప్లికేషన్  చేసుకోవాల్సి ఉంటుందని గురువారం పత్రిక ప్రకటనలో ఆమె సూచించారు. రాష్ర్ట వ్యాప్తంగా 239 కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. స్టూడెంట్లు అప్లై చేసుకునే ముందు క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలని పేర్కొన్నారు.