హైదరాబాద్: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) లో 2024 సంవత్సరానికి గాను ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రామా- సీసీ మాట్ లో సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తు విధానం :
ఆన్ లైన్ అప్లయ్ చేసిన తర్వాత హార్డ్ కాపీని కావాల్సిన ధృవ పత్రాలతో వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా అసోసియేట్ డీన్, అకడమిక్ 1, రెండో ఫ్లోర్, పాత OPD బ్లాక్, NIMS, పంజాగుట్ట, హైదరాబాద్ లో 2024 జనవరి 29 సాయంత్రం 5గంటల లోపు సమర్పించాలి.
అభ్యర్థులు ఆన్ లైన్ అప్లికేషన్, ప్రాస్పెక్టస్ , మరిన్ని అప్ డేట్ లకోసం NIMS వెబ్ సైట్(www.nims,edu.in)ని సందర్శించవచ్చు.
ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేది: జనవరి 25
CCEMAT కోర్సులో మొత్తం ఐదు సీట్లు ప్రవేశానికి అందుబాటులో ఉన్నాయి.