స్కాలర్​షిప్​ కోసం అప్లయ్​ చేసుకోండి : ఎం.జయపాల్​రెడ్డి

యాదాద్రి, వెలుగు : అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద అందించే స్కాలర్​షిప్​కోసం ఎస్సీ కులాలకు చెందిన స్టూడెంట్స్ అప్లయ్​ చేసుకోవాలని షెడ్యూల్డ్​కులాల అభివృద్ధి ఆఫీసర్​ఎం.జయపాల్​రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎస్సీ స్టూడెంట్స్​కు ప్రభుత్వం స్కాలర్​షిప్​అందిస్తున్నదని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్​ 13లోపు https://telanganaepass.gov.in  వెబ్​సైట్​లో అప్లయ్​చేసుకోవాలని సూచించారు.