అర్హులందరికీ 4 పథకాలు : వివేక్​ వెంకటస్వామి

అర్హులందరికీ 4 పథకాలు : వివేక్​ వెంకటస్వామి
  • ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోండి: వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించిన నాలుగు కొత్త పథకాల్లో నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో గ్రామ సభలను సక్సెస్​ చేయడంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఒక వీడియో సందేశం రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీలో అర్హతలు ఉన్న వారందరికీ ఇప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. స్కీంలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులను నమ్మొద్దని సూచించారు. అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరూ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తహసీల్దార్​, మున్సిపల్ ఆఫీసులకు వెళ్లి ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జాబితాలో పేర్లు లేకపోయినా, డిలీట్ అయినా పథకాలకు అర్హత ఉన్న వారికి తప్పనిసరిగా స్కీంలు ఇప్పిస్తానని ఆయన స్పష్టం చేశారు.