విగ్రహాల ఏర్పాటుకు ఆన్​లైన్​లో అప్లయ్​ చేసుకోవాలి : వి.సత్యనారాయణ

  •     సీపీ సత్యనారాయణ

నిజామాబాద్ క్రైమ్, వెలుగు : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విగ్రహాలు ఏర్పాటుకు ఆన్​లైన్​లో అప్లయ్​ చేసుకోవాలని పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో విగ్రహాలు పెట్టేవారు http/policepotal.tspolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించని, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉన్న ప్రదేశాలకు పోలీసుల అనుమతి ఉంటుందన్నారు.

ఉత్సవ వేడుకలకు అవసరమయ్యే విద్యుత్ కనెక్షన్, సంబంధిత శాఖ అనుమతి తీసుకున్న పత్రం జతపరచాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు సౌండ్ సిస్టమ్​ఉపయోగించరాదన్నారు. ఉత్సవ నిర్వాహకులు మండపం వాలంటీర్లను నియమించాలని సూచించారు.

బోధన్ : నిజామాబాద్​ పోలీస్​ కమిషనర్​వి.సత్యనారాయణ బోధన్​ పోలీస్ ​స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్​లో  నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.  వినాయక చవితి, మిలాద్​ఉన్​ నబీ పండగల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్​ఎస్. జయరాం, బోధన్​ఏసీపీ కిరణ్​కుమార్, సీఐ ప్రేమ్​కుమార్​ తదితరులు ఉన్నారు.​