హైదరాబాద్: గ్రేటర్ లో సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. చేపట్టాల్సిన సన్నాహాలు మొదలుపెట్టేందుకు నోడల్ అధికారులను నియమకం జరిగింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేయాల్సిన ఏర్పాట్లు, నిర్వహించాల్సిన విధులపై ఆయా అంశాల వారీగా నోడల్ అధికారులను నియమించామని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు. నోడల్ అధికారులుగా నియమితులైన అదనపు కమీషనర్లు, విభాగాధిపతులతో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశం నిర్వహించారు.
ఎలెక్టోరల్ రోల్ ప్రేపరషన్, ప్రింటింగ్, ఓటర్ ఎన్యూమరేషన్, రిటర్నిoగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియామకం పై చర్చించారు. మాస్టర్ ట్రైనర్లు నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఎలెక్షన్ మెటీరియల్ సేకరణ, ఐ టీ సంబంధిత ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఎన్ ఫోర్స్ మెంట్ టీములు నియామకం, పోలింగ్ సిబ్బంది నియామకం, పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల గుర్తింపు, వసతులు కల్పన, మైక్రో అబ్జర్వర్ల నియామకం, పోలింగ్ కేంద్రాలు గుర్తింపు, వసతులు, కంప్లైంట్ సెల్, కాల్ సెంటర్, మీడియా సర్టిఫికేషన్, మోనిటరింగ్ సెల్, చెల్లింపు వార్తలు (పెయిడ్ న్యూస్) పరిశీలన, ఓటర్ల చైతన్యం, స్వీప్ కార్యక్రమాలు తదితర అంశాల గురించి నోడల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు కమిషనర్.
ఎలెక్షన్ కమీషనర్ నుండి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు తమకు కేటాయించిన అంశాలపై తగిన కార్యాచరణతో సిద్దంగా ఉండాలని.. అలాగే స్టేట్ ఎలెక్షన్ కమీషన్ జారీచేసే ఉత్తర్వులు, నిబంధనలు గురించి ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు.