
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టులో అదనపు జడ్జిలుగా పనిచేస్తు న్న జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ సుజన కలసికంను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2023 జులై 31న అదనపు న్యాయ మూర్తులుగా బాధ్యతలు చేపట్టిన ఈ ముగ్గురిని శాశ్వత న్యాయమూర్తుల నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం విదితమే.
కొలీజియం సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఆ ముగ్గురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు మొదటి కోర్టు హాలులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ వారితో ప్రమాణం చేయించనున్నారు.