కోల్బెల్ట్, వెలుగు: ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐటీయూసీ అనుబంధ) నూతన అధ్యక్షుడిగా సింగరేణి కార్మిక నేతవాసిరెడ్డి సీతారామయ్య ఎన్నికయ్యారు. జార్ఖండ్రాజధాని రాంచీలో గురువారం జరిగిన ఫెడరేషన్(ఐఎండబ్ల్యూఎఫ్) కౌన్సిల్సమావేశంలో అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
ఈ ఫెడరేషన్దేశంలోని 8 కోలిండియా బొగ్గు పరిశ్రమలతోపాటు సింగరేణి సంస్థలో యూనియన్కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏఐటీయూసీ సింగరేణి విభాగం స్టేట్ అధ్యక్షుడైన సీతారామయ్య ఐఎండబ్ల్యూఎఫ్ అధ్యక్షునిగా మూడేండ్లపాటు కొనసాగనున్నారు. ఆయన ఎన్నిక పట్ల ఏఐటీయూసీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.