గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెలకు ప్రభుత్వం కీలక పదవి

హైదరాబాద్: ప్రజా యుద్ధనౌక గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‎గా వెన్నెలను నియమించింది. ఈ మేరకు యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ 2024, నవంబర్ 16న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటతో ఉర్రూతలూగించిన బహుజన యుద్ధ నౌక్ గద్దర్ ఫ్యామిలీని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగానే గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ తరుఫున కంట్మోమెంట్ నుండి బరిలోకి దిగిన వెన్నెల బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్య నందిత  చేతిలో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్‎కు ఉప ఎన్నిక రాగా.. బీజేపీ నుండి వచ్చిన గణేష్‎కు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే వెన్నెలకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‎గా అవకాశం కల్పించింది.