స్టాఫ్‌‌‌‌ నర్సులకు జనవరి 31 నియామక పత్రాలు : వెంకట్‌‌‌‌రావు

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో కొత్తగా ఉద్యోగాలు సాధించిన స్టాఫ్ నర్సులకు ఈ నెల 31న హైదరాబాద్‌‌‌‌లోని ఎల్‌‌‌‌బీ స్టేడియంలో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి నియామక పత్రాలు అందిస్తారని కలెక్టర్ వెంకట్‌‌‌‌రావు తెలిపారు. ఈ మేరకు జిల్లాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌‌‌‌లో అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రియాంకతో కలసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో 212 మంది స్టాఫ్‌‌‌‌ నర్సులుగా నియమితులయ్యారని చెప్పారు.వీరిని ఈ నెల 31న నాలుగు బస్సుల్లో హైదరాబాద్‌‌‌‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇందుకోసం మెడికల్ ఆఫీసర్లను లైజనింగ్ అధికారులుగా నియమించామని చెప్పారు.అనంతరం జిల్లాలో నులిపురుగుల నివారణ కార్యక్రమంపై మాట్లాడుతూ.. ఫిబ్రవరి 12న అన్నిఅంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో స్టూడెంట్లకు మాత్రలు వేయాలని సూచించారు.అనంతరం వేసవిదృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా ముందస్తుచర్యలు సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే మోడల్ స్కూల్స్,కేజీబీవీల్లో ప్రహరీలు, టాయిలెట్స్, కొత్త జీపీభవనాలు చేపట్టేందుకుప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.