దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా దీపావళికి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వ హించిన ప్రెస్మీట్లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఫైనాన్షియల్ బ్యాక్డ్రాప్లో ఇలాంటి ఓ తెలుగు సినిమా కూడా తీయొచ్చు అని ప్రయోగాత్మకంగా దీన్ని తెరకెక్కించాం.
ఒక్క నెగెటివ్ కామెంట్ రాకుండా మా సినిమాను ప్రశంసిస్తున్నారు. అదే మాకు అతి పెద్ద విజయం. వసూళ్లు వాటంతట అవే వస్తాయి’ అని చెప్పారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ వచ్చింది. ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదు. పండగ అయినా మొదటిరోజు మంచి వసూళ్లు రావడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.