
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సీబీ శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: మొత్తం 5000 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 106, ఆంధ్రప్రదేశ్‌లో 141 ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 1. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ 2. బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్ 3. బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ 4. బేసిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ 5. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 3వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 2వ వారంలో పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.centralbankofindia.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.