![వైజాగ్ స్టీల్ ప్లాంటులో అప్రెంటిస్](https://static.v6velugu.com/uploads/2023/07/Vizag-Steel-Plant_drO1f9Wxpz.jpg)
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(వైజాగ్ స్టీల్) 2023 ఆగస్టు బ్యాచ్‌కు సంబంధించి వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కు అర్హుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 200, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 50 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్.
అర్హత: 2021, 2022, 2023 విద్యా సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా, బీటెక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ జులై 31 వరకు ఉంటుంది. పూర్తి సమాచారం కోసం www.vizagsteel.com వెబ్సైట్లో సంప్రదించాలి.