
జైపూర్(రాజస్థాన్)లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)–నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎస్‌డబ్ల్యూఆర్ పరిధిలోని వర్క్‌షాప్/యూనిట్‌లలో 1646 యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
ట్రేడులు: ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితర పోస్టుల ఉన్నాయి.
అర్హత: కనీసం పదో తరగతిలో 50శాతం మార్కులతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలకు www.rrcjaipur.in వెబ్సైట్లో సంప్రదించాలి.