
వెస్ట్రన్ రైల్వే 2023-–24 సంవత్సరానికి వెస్ట్రన్ రైల్వే పరిధిలోని డివిజన్/ వర్క్‌షాప్‌లలో 3,624 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
ట్రేడ్: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మ్యాన్,
మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ- మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), పీఏఎస్‌ఎస్‌ఏ, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ట్రైనింగ్ ఏడాది ఉంటుంది.
సెలెక్షన్: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.rrc-wr.com వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.