హైదరాబాద్, వెలుగు: తాము అందుబాటులోకి తెచ్చిన కోరోకిల్ -జెడ్ఎన్ కరోనా నుంచి రక్షణ ఇస్తుందని రెమిడియం థెరప్యూటిక్స్ సీఈఓ కృష్ణ తెలిపారు. తేలికపాటి కోవిడ్–-19 చికిత్సలో యాడ్ ఆన్ థెరపీ కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ దీనిని ఆమోదించిందని చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, మంట వంట లక్షణాల నుంచి ఉపశమనం కలిగించి, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పారు. రోగిలో రుచి, వాసన పునరుద్ధరణలో సహాయపడుతుందన్నారు.
కోరోకిల్- జెడ్ఎన్ యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-మైక్రోబయల్గానూ పని చేస్తుందని, వైరల్ లోడ్‌ను తగ్గిస్తుందని కృష్ణ చెప్పారు. వీటిని రోజూ రెండు క్యాప్సూల్స్ చొప్పున మూడు సార్లు, భోజనం తర్వాత ఏడు రోజుల పాటు (గరిష్టంగా 14 రోజులు) వేయాలి. రోగ నిరోధక శక్తి పెరగడానికి రోజుకు ఒక క్యాప్సూల్ చొప్పున మూడు సార్లు అవసరమైనంత కాలం వేసుకోవాలని ఆయన వివరించారు.