- గవర్నమెంట్ గ్రాంట్ల ద్వారా రూ.177 కోట్లు
- ట్యాక్స్‌ల రూపంలో రూ.90.09 కోట్లు
- డిపాజిట్లు, లోన్ల ద్వారా రూ.7.20 కోట్ల నిధుల సమీకరణ
- మేయర్ నీతూ కిరణ్ వెల్లడి
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మేయర్ దండు నీతూకిరణ్అధ్యక్షతన రూ.274.89 కోట్ల మున్సిపల్ కార్పొరేషన్వార్షిక బడ్జెట్‌కు గురువారం పాలకవర్గం ఆమోదం తెలిపింది. మీటింగ్తర్వాత మేయర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.177.59 కోట్ల గ్రాంట్స్వస్తాయని, మున్సిపల్ఆదాయం రూ.90.9 కోట్లు కాగా, మరో రూ.7.20 కోట్లను డిపాజిట్లు, లోన్ల ద్వారా సేకరిస్తామని చెప్పారు.
సాలరీలకు 36 శాతం బడ్జెట్
బడ్జెట్లో 36 శాతం నిధులు (సుమారు రూ.32.60 కోట్లు) మున్సిపల్ సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చు చేయనున్నామన్నారు. శానిటేషన్‌కు రూ.8.77 కోట్లు, పవర్ బిల్లు రూపంలో రూ.10.88 కోట్ల ఖర్చు ఉంటుందని అంచనా వేశారు. నిబంధనల ప్రకారం గ్రీన్‌కోర్‌కు పదిశాతం అంటే రూ.9.01 కోట్లు, ఇంజినీరింగ్ సెక్షన్ నిర్వహణకు రూ.7.18 కోట్లు, జనరల్అడ్మినిస్ట్రేషన్కు రూ.3.85 కోట్లు, టౌన్ ప్లానింగ్ విభాగానికి రూ.22 లక్షలు, నిర్మాణ పనులకు రూ.11.60 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కట్టాల్సిన లోన్ కిస్తులేమీ లేవని చెప్పారు. గత బడ్జెట్లో మిగిలిన పనులను పూర్తి చేస్తామని, కొత్త పనుల విషయమై కార్పొరేటర్లతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు.
మీడియాను అనుమతించాలని డిమాండ్
బడ్జెట్మీటింగ్ను మీడియా సమక్షంలో నిర్వహించాలని మెజార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమావేశం ఆరంభంలో మేయర్ సూచన మేరకు పోలీసులు మీడియాను బయటకు పంపడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగే మీటింగ్స్‌కు మీడియాను అనుమతిస్తున్నారని, ఇక్కడెందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్అమలు చేసిన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మీడియాను అనుమతించకుండానే మేయర్ మీటింగ్‌ను కొనసాగించారు. ఎమ్మెల్సీ హోదాలో మొదటిసారి మహేశ్గౌడ్సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ మంద మకరంద్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్‌ఖాన్ హాజరయ్యారు.