అవయవదానం బిల్లుకు ఆమోదం హర్షణీయం

అవయవదానం బిల్లుకు ఆమోదం హర్షణీయం

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అవయవదానం బిల్లును  అసెంబ్లీలో  పెట్టడం, ఆమోదం పొందడం హర్షణీయమని ఆలిండియా బాడీ అండ్ ఆర్గాన్​ డోనర్స్​అసోసియేషన్​వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మి అన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.శుక్రవారం ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అవయవ దాతల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అంత్యక్రియల సమయంలో కలెక్టర్ లేదా ఆర్డీవో స్థాయి అధికారి వచ్చి పూలమాల వేసి, బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని కోరారు.  సంఘం కో–-ఆర్డినేటర్ ఎస్ .శ్రీనివాస్, సభ్యులు కవిత, రామలక్ష్మి, రజని పాల్గొన్నారు.