‘గో కరోనా గో’ నుంచి ‘సంపర్క్​ ఓ మీటర్’​ వరకూ

‘గో కరోనా గో’ నుంచి ‘సంపర్క్​ ఓ మీటర్’​ వరకూ
  • మోబైల్​ యాప్స్​ డెవలప్​ చేసిన ఐఐఎస్సీ, ఐఐటీలు
  • కరోనాపై పోరాటానికి తమ వంతుగా స్టూడెంట్ల సాయం

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాటంలో తమ వంతుగా ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్సెస్(ఐఐఎస్సీ), ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల స్టూడెంట్లు తమ వంతు సాయం చేస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో మొబైల్​ అప్లికేషన్లను డెవలప్​ చేసి జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘గో కరోనా గో’ ఐఐఎస్సీ బెంగళూరుకు చెందిన పలువురు స్టూడెంట్ల టీమ్​ ఈ యాప్​ను రూపొందించింది. ‘‘ఈ యాప్​ సాయంతో కరోనా పాజిటివ్​ పేషెంట్లు, అనుమానితుల కదలికలను తెలుసుకోవచ్చు. బ్లూటూత్, జీపీఎస్​ ద్వారా వారు ఎవరెవరిని కలిశారు. ఎక్కడెక్కడికి వెళ్లారు పసిగట్టేయవచ్చు. ఈ యాప్​ టెంపోరల్​ నెట్​వర్క్​ అనలిటిక్స్​ ను బ్యాక్​ ఎండ్​లో వాడుకుంటూ హైరిస్క్​ ఉన్న వ్యక్తులు ఎవరిని కాంటాక్ట్​ అయ్యారు. వైరస్​ స్పెడ్​ ఎలా ఉంది అనే విషయాలను గురించవచ్చు”అని ఐఐఎస్సీ ఫ్యాకల్టీ మెంబర్​ తరుణ్ చెప్పారు. ఇదొక్కటే కాదు ఐసోలేషన్, ప్రాక్సిమిటీ స్కోర్లను కూడా అందిస్తుంది. సోషల్ డిస్టెన్స్​కు సంబంధించి సాయం చేస్తుంది. క్వారంటైన్​ లో ఉన్నవారు కదలికలపై నిఘా పెట్టేందుకు జియో ఫెన్సింగ్​ ఫీచర్​ కూడా ఇందులో ఉంది.

సంపర్క్​ ఓ మీటర్ యాప్
ఐఐటీ రోపర్​ కు చెందిన ఓ బీటెక్​ స్టూడెంట్​ సాహిల్​ వర్మ ‘సంపర్క్​ ఓ మీటర్’​ యాప్​ను రూపొందించాడు. కరోనా వైరస్​ ఇన్ఫెక్షన్​ పాజిబులిటీస్​ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మ్యాప్స్ ద్వారా గుర్తించడానికి ఈ యాప్​ ఉపయోగపడుతుంది. వివిధ ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్​రిస్క్​ స్కోర్​ను కూడా అందిస్తుంది. దీని ఆధారంగా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది. సెల్ఫ్​ ఐసోలేషన్​లోకి వెళ్లడం.. డాక్టర్​ ను కన్సల్ట్​ చేయడం వంటివి అవసరాన్ని బట్టి చేయొచ్చు. ప్రస్తుతం కాంటాక్ట్​ ట్రైసింగ్, కరోనా అనుమానితులను ఐసోలేట్​ చేయడం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉందని, కానీ దీనికి ఎక్కువ టైమ్​ పడుతుండటంతో కొందరు పాజిటివ్​ పేషెంట్లు మరికొంత మందికి వైరస్​ను అంటిస్తున్నారని, ఈ యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకున్నట్లయితే టైమ్​టు టైమ్​ అలెర్ట్​ చేస్తుందని, దీని వల్ల వైరస్​ మరింత విస్తరించకుండా చేయొచ్చని సాహిల్​ వర్మ చెప్పాడు.

కోరన్​టైన్​యాప్​
ఇలాంటిదే కోరన్​ టైన్​ పేరుతో మరో యాప్​ ను ఐఐటీ బాంబే స్టూడెంట్ల టీమ్​ రూపొందించింది. కరోనా లక్షణాలు ఉన్న వారు.. లేదా అనుమానితులు క్వారంటైన్​ జోన్​ ను వదిలి బయటకు వెళితే వెంటనే ఈ యాప్​ గుర్తిస్తుంది. టైమ్​ టు టైమ్​ జీపీఎస్​ కో ఆర్డినేట్స్​ను అధికారులకు చేరవేస్తుంది. ఒకవేళ ఎవరైనా జీయో ఫెన్సింగ్​ లో మార్క్​ చేసిన క్వారెంటైన్​ జోన్​ను దాటి వెళితే వెంటనే డిటెక్ట్​ చేస్తుంది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీ స్టూడెంట్లు కూడా కోవిడ్​ పాజిటివ్​ కేసులను ట్రేస్​ చేసేందుకు ఉపయోగపడే యాప్​లను డిజైన్​ చేశారు. రూర్కీ స్టూడెంట్లు రూపొందించిన యాప్​ ను ఆప్ చేస్తే వెంటనే అధికారులకు అలర్ట్​ వెళ్లిపోతుంది. ఆ వ్యక్తి ఉన్న లొకేషన్​ ఎస్ఎంఎస్​ ద్వారా అందుతుంది. అంతేకాకుండా క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులు/ ప్లేసులకు సంబంధించిన ఫొటోలను గూగుల్​ మ్యాప్స్​ ద్వారా షేర్​ చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా అడ్మినిస్ట్రేటర్స్​ అన్ని రిపోర్ట్స్​ ను మ్యాప్​ ద్వారా చూసే వీలు కల్పిస్తుంది.