ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ బుధవారం తవ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. గత వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో గౌతమ్ సవాంగ్ డీజీపీగా పని చేశారు. 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో ఉన్నారు.
ఉద్యోగ విరమణకు రెండేళ్ల ముందే గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. సవాంగ్ 2022 మార్చిలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2024 జూలై 3న ఆయన తన పదవికి రాజీనామా చేశారు.