ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1, గ్రూప్-II పోస్టులు భర్తీ

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1, గ్రూప్-II  పోస్టులు భర్తీ

ఏపీ నిరుద్యోగులకు  ఆ రాష్ట్రప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.   ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న  Group 1,  Group 2 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం APPSC కు  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 597 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ (APPSC)కి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ల ద్వారా మొత్తం 597 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 89 APPSC Group 1 పోస్టులు కాగా.. 508 APPSC Group 2 పోస్టులున్నాయి.

 Group 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్‌ కమిషనర్‌  , అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టులతో సహా పలు ఉద్యోగాల భర్తీకి అనుమతించారు. APPSC Group 2 కేటగిరీ కింద డిప్యూటీ తహసీల్దార్లు (గ్రేడ్‌ II), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ III, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్ II తో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు APPSC కి అనుమతిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 

(Group I) గ్రూప్ 1 ఖాళీల వివరాలు

గ్రూప్-1 కు సంబంధించి హోం శాఖలో అత్యధికంగా 27 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డీఎస్పీ పోస్టులు (25) డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ జైల్స్-(1) ,డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్-(1) ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 44 పోస్టులు , .ఆర్థిక శాఖలో 8 ఖాళీలు ఉన్నాయి.మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న  ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. 

(Group II) గ్రూప్ 2 ఖాళీల వివరాలు

ఇక   గ్రూప్-2  పోస్టులకు సంబంధించి  అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 161 ఉన్నాయి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 150, డిప్యూటీ తహసీల్దార్ 114, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18, సబ్ రిజిస్ట్రార్ 16,మున్సిపల్ కమిషనర్ పోస్టుల విభాగంలో 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.