APPSC GROUP 1 పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 17న జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు పూర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ ను విడుదల చేసింది. హాల్ టికెట్లను అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షల కోసం 1 లక్ష 48వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ 1 ను మార్చి 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించనున్నారు. పేపర్ 2 ను అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in నుండి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను రాష్ట్రంలోని 18జిల్లాల్లో 301 సెంటర్లలో నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాలు హాల్ టికెట్లో ఉంటాయని అధికారులు తెలిపారు.