గ్రూప్ 2 మెయిన్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 28న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది APPSC. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ప్రెస్ నోట్ ద్వారా తెలిపింది.గత ప్రభుత్వ హయాంలో 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ నోటిఫికేషన్ ద్వారా 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 556నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అప్పటి ప్రభుత్వం.
ఈ క్రమంలో ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా ఏప్రిల్ రెండవ వారంలో ఫలితాలు విడుదలయ్యాయి. జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది ఏపీపీఎస్సీ. తాజాగా మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.