Vastu tips: అపార్ట్​ మెంట్​ లో దక్షిణం ఫేసింగ్​ ప్లాట్​ తీసుకోవచ్చా.. ఏమైనా ఇబ్బందులు వస్తాయా..!

Vastu tips: అపార్ట్​ మెంట్​ లో దక్షిణం ఫేసింగ్​ ప్లాట్​ తీసుకోవచ్చా.. ఏమైనా ఇబ్బందులు వస్తాయా..!

ఇల్లు నిర్మించడం కోసం.. ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తాం.  ప్రస్తుతం  స్థలాలు కొని ఇల్లు కొనేదానికంటే  అందరూ అపార్ట్​మెంట్​లలోని ప్లాట్​ కొనుక్కొంటున్నారు.  వాటిని బిల్డర్​ కట్టి అమ్ముతుంటారు.  స్థలం కొని... ఇల్లు నిర్మించేదానికంటే శ్రమ.. ఖర్చు తక్కువ అవుతుంది.  అయితే అపార్ట్​మెంట్లలో ఏ దిక్కులో ఉండే ప్లాట్లను కొనుగోలు చేయాలో వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారి సలహాలను.. సూచనలను ఒకసారి పరిశీలిద్దాం. . . 

ప్రశ్న: దక్షిణం వైపు ఉండే ప్లాట్లను తీసుకోవద్దు అంటారు.. తీసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. దక్షిణ ముఖంగా ఉన్న స్థలం  వాస్తు ప్రకారం ఏ రాశివారికైనా బాగుంటుందా? దీనిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయండి?  

జవాబు: దక్షిణం దిక్కు ప్లాట్ పనికొస్తుంది. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఇంటి షేపులు, మెజర్ మెంట్స్ సరిగ్గా ఉండాలి. ఏమైనా డౌట్లు ఉంటే, ఇంటి ఏరియల్ వ్యూ ఫొటోలు తీసుకొని సరైన వాస్తు నిపుణుడ్ని సంప్రదించండి. కొంతమందికి పేరును బట్టి దక్షిణం ఫేస్​ ఇబ్బందులు వస్తాయి.  అలాంటి వారు తప్ప అందరూ కొనుక్కోవచ్చు.  ఇంకాకొన్ని వాస్తు విషయాలు డైరక్ట్​గా చూస్తేనే పరిష్కారం లభిస్తుందని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.

ALSO READ | Vastu tips: దక్షిణం దిక్కున వీధిపోటు ఉంటే ఏమి చేయాలి..?