
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవుదినంగా అధికారికంగా నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.
संविधान के शिल्पकार, समाज में समानता के नए युग की स्थापना करने वाले हमारे बाबा साहेब पूज्य डॉ. भीमराव अंबेडकर जी की जयंती पर अब राजकीय अवकाश होगा।
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) March 28, 2025
बाबा साहेब के अनन्य अनुयायी आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने यह निर्णय लेकर राष्ट्र की भावना को सम्मान दिया है। pic.twitter.com/f8eWuKsxmd
డాక్టర్ అంబేద్కర్ దేశానికి చేసిన శాశ్వత కృషికి గుర్తింపుగా ప్రభుత్వం సెలవుదినాన్ని పాటించాలని నొక్కి చెప్పింది.ఈ మేరకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 2025 ఏప్రిల్14(సోమవారం) భారతదేశం అంతటా పారిశ్రామిక సంస్థలు సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా Xలో ప్రకటించారు.సమాజంలో సమానత్వం కొత్త శకాన్ని స్థాపించిన రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జీ జయంతి సందర్భంగా ఇప్పుడు ప్రభుత్వ సెలవుదినం. బాబా సాహెబ్ నమ్మకమైన అనుచరుడు, ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజల మనోభావాలను గౌరవించారు. అని గజేంద్ర సింగ్ షెకావత్ రాశారు.