OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలపై ఓ లుక్కెయ్యండి..

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలపై ఓ లుక్కెయ్యండి..
  • టైటిల్ : లవ్‌‌‌‌‌‌‌‌యాప, 
  • ప్లాట్​ ఫాం : జియోస్టార్​ , 
  • డైరెక్షన్ : అద్వైత్ చందన్
  • కాస్ట్​ : జునైద్ ఖాన్, ఖుషీ కపూర్, అశుతోష్ రాణా, గ్రుషా కపూర్, కికు శారదా

ప్రదీప్ రంగనాథన్, ఇవానా నటించిన తమిళ సినిమా ‘లవ్​ టుడే’ 2022లో రిలీజై సూపర్​ హిట్​ అయ్యింది. ఆ సినిమా ఇన్​స్పిరేషన్​తో హిందీలో ‘లవ్​యాప’ తీశారు. కథలోకి వెళ్తే.. బానీ (ఖుషీ కపూర్), గౌరవ్ (జునైద్ ఖాన్) ప్రేమించుకుంటారు. వాళ్ల ప్రేమ చాలా స్వచ్ఛమైనది అని నమ్ముతారు. దాంతో ప్రేమ విషయం బానీ తండ్రి అతుల్ (అశుతోష్ రాణా)కి చెప్తారు. అప్పుడు అతుల్​ ఒక కండిషన్​ పెడతాడు. బానీ, గౌరవ్​లను ఒకరి ఫోన్​ మరొకరు మార్చుకోవాలని చెప్తాడు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య గొడవలు రాకపోతే వాళ్ల ప్రేమని ఒప్పుకుంటానంటాడు. వాళ్లు ఆ కండిషన్​కు ఒప్పుకుని ఫోన్లు మార్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. 

లైఫ్​ బెట్టింగ్​ 

  • టైటిల్ : టెస్ట్, 
  • ప్లాట్​ ఫాం : నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్,
  • డైరెక్షన్ : ఎస్ శశికాంత్,
  • కాస్ట్​ : మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్

కుముదా శరవణన్ (నయనతార) ఒక స్కూల్ టీచర్. ఆమెకు 34 ఏండ్లు వచ్చినా పిల్లలు పుట్టరు. ఐవీఎఫ్ కోసం డాక్టర్లు రూ. 5 లక్షలు అడుగుతారు. ఆమె భర్త శరవణన్ (మాధవన్) సైంటిస్ట్. నీటితో నడిచే హైడ్రో ఫ్యూయెల్‌ ఇంజిన్‌ తయారుచేసి, ప్రభుత్వ అనుమతి కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాళ్లు ఆ ప్రాజెక్ట్​ని ఓకే చేయడానికి రూ.50 లక్షలు అడుగుతారు. కుముద స్కూల్‌‌‌‌‌‌‌‌మేట్ అర్జున్ (సిద్ధార్థ్) ఇండియన్​ టీమ్​లో క్రికెటర్‌‌.​ కానీ.. ఫామ్​లో లేకపోవడంతో క్రికెట్ కమిటీ అతన్ని టీమ్​ నుంచి తీసేయాలి అనుకుంటుంది. తనను తాను నిరూపించుకోవడానికి అతనికి ఒక మ్యాచ్​లో అవకాశం వస్తుంది. అలాంటి టైంలో కుముద, అర్జున్​, శరవణన్​ జీవితాల్లోకి ఒక బెట్టింగ్​ ముఠా వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

డామినేషన్​.. 

  • టైటిల్ : మచాంటే మలఖా,
  • ప్లాట్​ ఫాం : మనోరమా మ్యాక్స్​
  • డైరెక్షన్ : బోబన్ సామ్యూల్,
  • కాస్ట్​ : సౌబిన్ షాహిర్, నమిత ప్రమోద్, శాంతికృష్ణ, కె.యు.మనోజ్, దిలీష్ పోతన్, ధ్యాన్ శ్రీనివాసన్

సజీవన్ (సౌబిన్ షాహిర్) బస్ కండక్టర్​గా పనిచేస్తుంటాడు. అదే బస్​లో బిజిమోల్ (నమితా ప్రమోద్) రెగ్యులర్​గా ప్రయాణం చేస్తుంటుంది. దాంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. కొన్నాళ్లకు ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెండ్లి చేసుకుంటారు. కానీ.. పెండ్లి తర్వాత బిజిమోల్​ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. తరచూ సజీవన్​తో గొడవ పడుతుంది. దానికి కారణం ఆమె తల్లి కుంజిమోల్ (శాంతికృష్ణ). ఆమె తన భర్త (కె.యు. మనోజ్) జీవితాన్ని నరకంలా మార్చేస్తుంది. నిరంతరం అతన్ని కోపగించుకుంటూ ఉంటుంది. అదంతా చూసిన బిజిమోల్ కూడా తన భర్త పట్ల అలాగే ప్రవర్తిస్తుంటుంది. అలాంటి బిజిమోల్​కు సజీవన్​  ఎలా బుద్ధి చెప్పాడు? వాళ్ల మధ్య గొడవలు పెరగడానికి కారణాలేంటి? తెలియాలంటే సినిమా చూడాలి.