హైటెక్ యుగంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇప్పటికీ ఏటా లక్షలాది మంది మలేరియా బారిన పడుతున్నారు. ఎంతోమంది చనిపోతున్నారు. దోమల నివారణ ద్వారానే మలేరియా వ్యాధిని అరికట్టాలి. మలేరియా వ్యాధి నివారణపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. నేడు ( ఏప్రిల్ 25) ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. . .
2007 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్25న మలేరియా నివారణ దినోత్సవం నిర్వహిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 'జీరో మలేరియా స్టార్ట్ విత్ మి' అనే థీమ్తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. . ఎంతో సైన్స్ పరిజ్ఞానం ఉన్న హైటెక్ రోజుల్లో కూడా మలేరియా వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అసలు ఏ మందులు లేని కాలంలో అయితే లక్షలాది మంది ప్రాణాలు పోయాయి.
నిజాం కాలంలో మలేరియా వ్యాధి వల్ల అనేక మంది చనిపోయారు. ఆ సమయంలో వైద్యం అంతగా అభివృద్ది చెందలేదు. ఎందుకు చనిపోతున్నారో .. ఏ వ్యాధి కారణంగా అనే విషయం కూడా అప్పటి వైద్యులకు అంతుపట్టలేదు. ఆ సమయంలో ప్రజలు దాన్ని 'గత్తర', 'మహమ్మారి' అని పిలిచేవాళ్లు. ఎక్కడైన ఒక గ్రామంలో గత్తర వచ్చిందంటే చుట్టు పక్కల గ్రామాలకు కూడా వ్యాపించేది.. వందల మంది ప్రాణాలు పోయేవి. ఆ సయమంలో బ్రిటీష్ ప్రభుత్వం కొనసాగేది. అప్పుడు వాళ్లు నియమించిన వైద్యుడు రోనాల్డ్ రాస్ హైదరాబాద్కు వచ్చాడు. ఈ వ్యాధి మూలాలను కనుక్కోవాలని అనేక పరిశోధనలు చేశాడు. రోగుల రక్తనమూనాలను సేకరించి పరిశీలించాడు. దోమకాటు వలన ఈ వ్యాధి వచ్చిందని రోనాల్డ్ రాస్ తెలిపాడు. దోమలు వృద్ది చెందకుండా పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని సూచిస్తూ ఈ వ్యాధిని మలేరియా అని పేర్కొన్నాడు. అయితే మలేరియా వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాడు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వ్యాధి సోకిన వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలి. వైద్య పరీక్షలు చేయించాలి.
- పట్టణాల్లో గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
- మురుగు కాలువలు వీధులను శుభ్రంగా ఉంచాలి.
- అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాల్లో దోమల మందులను స్ప్రే చేసి దోమలను నాశనం చేయాలి.
- దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- పూల కుండీల్లో వీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.
- ఇంట్లో ఉండే నీటి పాత్రల మీద మూతలు గట్టిగా బిగించి ఉంచాలి.
- నల్లా నీళ్లు పట్టే ప్రతిసారి ట్యాంకులను శుభ్రం చేయాలి.
- ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి