ఏప్రిల్​ 30న అక్షయ తృతీయ.. బంగారం కొనేందుకు శుభ ముహూర్తం ఇదే..!

ఏప్రిల్​ 30న అక్షయ తృతీయ.. బంగారం కొనేందుకు శుభ ముహూర్తం ఇదే..!

అక్షయ తృతీయ పర్వదినం అనగానే అందరికీ గుర్తు వచ్చేది బంగారం. నిజానికి ఈ పండుగను లక్ష్మీదేవి కి సంబంధించిన వేడుకగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున కుబేరుడిని కూడా పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం చాలా శుభప్రదం అని భావిస్తారు.  అలాగే ఆ రోజు తమ తాహతుకు తగ్గట్టు ఎంతో కొంత బంగారం( Gold) వెండి( Silver ) వస్తువులను తమ ఇంటికి తెచ్చుకోవాలని, ఇది తమకు చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు శుభ సమయం ఎప్పుడు అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ఏడాది శ్రీవిశ్వావశు నామ సంవత్సరంలో (2025)  అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 30, బుధవారం నాడు వచ్చింది. అక్షయ తృతీయను హిందూ ధర్మంలో చాలా శుభ దినంగా భావిస్తారు.  అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ రోజున కొత్త పనిని ప్రారంభించడం, బంగారం, వెండి కొనుగోలు చేయడం వంటివి పాటించడం వలన ఇంటికి శుభాన్ని తెస్తుందని నమ్ముతారు.

అక్షయ తృతీయ ఘడియలు : 

  •  ఏప్రిల్ 29 సాయంత్రం 05:31 గంటలకు ప్రారంభం
  • ఏప్రిల్ 30 మధ్యాహ్నం 02:12 గంటలకు ముగింపు

అక్షయ తృతీయ పూజా ముహూర్తం :  ఏప్రిల్ 30 ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు 

బంగారం కొనుగోలుకు శుభముహూర్తం:

  • ఏప్రిల్​ 30  ఉదయం 05.41 నుండి మధ్యాహ్నం 02.12 వరకు. మొత్తం సమయం 08 గంటలు 30 నిమిషాలు ఉన్నాయి.
  • శుభమూహూర్తం : ఏప్రిల్​ 30 ఉదయం 05:41 నుండి 09:00 మరియు   ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:18 వరకు
  • అత్యుత్తమ ముహూర్తం:  ఉదయం 07:21 నుండి 09:00 వరకు మరియు ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:18 వరకు

ఒకపుడు అక్షయ తృతీయ, బంగారం కొనుగోళ్లుపై పెద్దగా ప్రాచుర్యం ఉండేది కాదు.  ప్రస్తుతం  అక్షయ తృతీయ సందడి బాగా పెరిగింది. దీనికి తగ్గట్టు జ్యుయల్లరీ వ్యాపారులు కూడా పలు రకాల ఆఫర్లతో ఆకర్షింన్నారు.దీంతోపాటు, అక్షయ తృతీయ ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేసుకోవాలనుకునేవారు తమ రాశి ప్రకారం కొనుగోలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | Good Health: ఉసిరితింటే.. కాలేయంలో కొవ్వు కరుగుతుంది..