ఏప్రిల్​ 4 నుంచి హైదరాబాద్​లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్

ఏప్రిల్​ 4 నుంచి హైదరాబాద్​లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే నెల 4 నుంచి -6 వరకు రేతిబౌలిలోని కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జరగనుంది. మూడు రోజులపాటు ఉదయం 11 గంటలకు మొదలై, రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. 25 ఆర్ట్ గ్యాలరీల ఏర్పాటుతోపాటు 50 మంది దిగ్గజ కళాకారులు, 200 మంది ప్రముఖ -యువ కళాకారులు పాల్గొననున్నారు. 100 స్టాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,500 పెయింటింగ్స్, శిల్పాలను ప్రదర్శనకు పెట్టనున్నారు. జోగెన్ చౌదరి, మను పరేఖ్ వంటి ప్రముఖుల కళాకృతులతోపాటు యువ ఆర్టిస్టుల ఎగ్జిబిట్స్​ఉంటాయని ఆర్ట్​ఫెస్టివల్​డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. ఫ్యూజన్ షోలు, లైవ్ మ్యూజిక్, ‘ఎటర్నల్ కాన్వాస్’ నిర్వహిస్తామని, ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు.