ఎప్రిలియా ట్యూనో వచ్చేసింది

ఎప్రిలియా ట్యూనో వచ్చేసింది

ఇటలీకి ఆటోమొబైల్ ​కంపెనీ  పియోజియోకు చెందిన ఎప్రిలియా తయారు చేసిన స్పోర్ట్స్​ బైక్ ​ట్యూనోను  ప్రీమియల్ ​ఆటోమొబైల్స్​ హైదరాబాద్​లో సోమవారం లాంచ్ ​చేసింది. తెలంగాణలో ఎక్స్​షోరూం ధర రూ.3.96 లక్షలు. 

డెలివరీలు త్వరలోనే మొదలవుతాయి. ట్యూనోలోని 457 సీసీ ఇంజన్​47.6 హెచ్​పీని విడుదల చేస్తుంది. 3 రైడింగ్​ మోడ్స్​​, ఎలక్ట్రానిక్స్ ​ఎయిడ్స్​, క్విక్​షిఫ్టర్​, స్లిప్పర్​ క్లచ్ ​వంటి ప్రత్యేకతలు దీని సొంతం.