RTC విలీనం : 2 నెలల్లో రిపోర్ట్ కోరిన CM జగన్

RTC విలీనం : 2 నెలల్లో రిపోర్ట్ కోరిన CM జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమీక్ష జరిపారు. రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జూన్ 13 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఐతే.. వీరిని చర్చలకు పిలిచింది కొత్త ప్రభుత్వం. జూన్ 8న ఏపీ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి జగన్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో… కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకున్నారు.

కార్మికులకు ఇచ్చిన హామీ అనుసరించి.. ఆర్టీసీ విలీనంపై ఓ కమిటీని ఏర్పాటుచేసింది ఏపీ ప్రభుత్వం. 2 నెలల్లోపు ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించాలని సీఎం జగన్ ఇవాళ అధికారులను ఆదేశించారు.