పూజారి సాయి కృష్ణ చేతిలో హత్యకు గురైన యువతి అప్సర తల్లి ఆవేదన అంతా ఇంతా కాదు. తన కూతురిని హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేస్తుంది. సాయికృష్ణ తరచూ తమ ఇంటికి వచ్చేవాడని.. కానీ ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదని వెల్లడించింది. తన కూతురు రోజూ గుడికి వెళ్లేదని.. అక్కడే సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడిందని తెలిపింది.
తన కూతురితో తాను సరూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లుగా అప్సర తల్లి చెప్పారు. తన భర్త కాశీలో ఉంటున్న కారణంగా సాయికృష్ణ అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేవాడని, భోజనం పెట్టమనేవాడని తెలిపింది. సాయికృష్ణ కుటుంబంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదంది.
అక్కయ్యా.. అక్కయ్యా అంటూ కలుపుగోలుగా మాట్లాడేవాడని, సాయికృష్ణకు ముందే పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో వారిద్దరి గురించి వేరే విధంగా ఆలోచించలేకపోయానని అప్సర తల్లి తెలిపింది. ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారిని చెప్పి్ంది. సాయి కృష్ణతో సంబంధం గురించి తన కూతురు కూడా ఏనాడూ తనతో చెప్పలేదంది.
అయితే..2023 జూన్ 3న అప్సర తన స్నేహితులతో కలిసి కోయంబత్తూర్ వెళ్తున్నట్లుగాచెప్పి వెళ్లిందని.. కానీ తనకేందుకో అనుమానం వచ్చి సాయి కృష్ణను ఆరా తీస్తే అప్సరను తన స్నేహితులతో కలిసి భద్రాచలానికి పంపించానంటూ చెప్పాడంది.
ఆ తర్వాత అప్సర ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో తనకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించానని అప్సర తల్లి వెల్లడించింది. పూజారి సాయి కృష్ణ ఇలా చేస్తాడని కలలో కూడా అస్సలు ఊహించలేదని అప్సర తల్లి బోరున విలపిస్తోంది. సాయి కృష్ణను ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేస్తుంది.