
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 31న థియేటర్లలో రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ రివేంజ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతుంది. ఏప్రిల్ 11నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు లయన్స్ గేట్ ప్లే అధికారికంగా ప్రకటించింది.
‘రాచరికం’ఓటీటీ:
దర్శకుడు సురేశ్ లంకపల్లి ఈ సినిమాను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, రివేంజ్, పొలిటికల్ అంశాలతో తెరకెక్కించాడు. క్రాక్ సినిమాలోని 'భూమ్ బద్దలు' పాటతో అప్సరా రాణి మంచి హీట్ ఇచ్చింది. అంతకుముందు ఆర్జీవీ తీసిన డీ కంపెనీ, డేంజరస్ సినిమాల్లో నటించింది. ఇపుడీ ఈ ‘రాచరికం’ సినిమాతో తనలోని రొమాంటిక్ మాస్ టచ్ను చూపించింది. అలాగే హీరో వరుణ్ సందేశ్ నెగిటివ్ రోల్లో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా, ఈ మూవీ IMDBలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకోవడంతో ఓటీటీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
April’s lineup on #LionsgatePlay is set to dazzle! 🌟 Which title are you most excited to stream? #AprilPremieres #MovieMagic pic.twitter.com/vWwlkduqla
— Lionsgate Play (@lionsgateplayIN) April 1, 2025
‘రాచరికం’కథేంటంటే:
1980ల నేపథ్యంలో రాచకొండలో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. భార్గవి రెడ్డి (అప్సర రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) తోబుట్టువులు. వీరిద్దరూ రాజకీయంగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తారు. శివ (విజయ్ శంకర్) మన శక్తి పార్టీ యువ నాయకుడు. క్రాంతి (ఈశ్వర్)ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకుడు. శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆమె తండ్రి రాజా రెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్)కి తెలుస్తోంది.
ALSO READ | పవర్‌ఫుల్ అర్జున్ సర్కార్గా నాని.. కౌంట్ డౌన్ షురూ..!
ఆ తర్వాత భార్గవి రెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. శివ, భార్గవి ప్రేమకు కులమతాలు ఎలా అడ్డుగోడలుగా నిలిచాయి? ఇక వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? ఈ ప్రేమ వల్ల రాచకొండలో ఏర్పడిన హింసాత్మక పరిణామాలు ఏంటి? భార్గవి, వివేక్ రెడ్డి రాజకీయాల్లో గెలవడానికి ఎలాంటి ఎత్తులు, పై ఎత్తులు వేశారు? అన్నది రాచరికం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.