హైదరాబాద్, వెలుగు: రెన్యువబుల్ ఎనర్జీ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు నిర్వహిస్తున్న ఆప్టా కెటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ శనివారం హైటెక్స్ (హైదరాబాద్) లో ప్రారంభం అయ్యింది. ఆదివారంతో ముగుస్తుంది. ఈ ఈవెంట్‌లో మొదటి రోజు16 ప్యానెల్ డిస్కషన్లు జరిగాయి. బొండాడ ఇంజినీరింగ్ ఎండీ రాఘవేంద్ర రావు, గ్రీన్‌కో అసోసియేట్ డైరెక్టర్ మౌర్య పైదా తదితరులు పాల్గొన్నారు.
ఇండియాలోని 5 శాతం వేస్ట్ ల్యాండ్‌ను వాడుకున్నా, పెద్ద మొత్తంలో సోలార్ కరెంట్‌ను ఉత్పత్తి చేయొచ్చని మౌర్య అన్నారు. కాగా, కెటలిస్ట్ బిజినెస్ పిచ్ కాంపిటీషన్(కేబీపీ)లో పాల్గొన్న 74 స్టార్టప్‌లలో 16 స్టార్టప్‌లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇవి కాన్ఫరెన్స్‌లో తమ ఐడియాలను వివరించాయి.